ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 5:43 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్.

హైదరాబాద్:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్20.

ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఈ పరిణామంపై ఆయన స్పందిస్తూ — ఖైరతాబాద్ గణేశుడి ఆశీస్సులతో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని, ఉప ఎన్నిక వస్తే పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు కారణంగా దేశవ్యాప్తంగా తన పేరు మరింత ప్రాచుర్యంలోకి వచ్చిందని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.
మరోవైపు,  బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దానం నాగేందర్ పిటిషన్ దాఖలు చేస్తే తమ వాదన కుడా వినాలని పిటిషన్ దాఖలు చేసింది.